అమోఘప్రభావుడైన శుకయోగీంద్రుడు ఇప్పుడు పరీక్షిత్తుకు శ్రీమహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపాన్ని వివరిస్తున్నాడు.
| 1 | పాదాల అడుగు భాగం | పాతాళం |
| 2 | మడమలు, పాదాల వేళ్ళు | రసాతలం |
| 3 | చీలమండలు | మహాతలం |
| 4 | పిక్కలు | తలాతలం |
| 5 | మోకాళ్ళు | సుతలం |
| 6 | తొడల దిగువ భాగం | వితలం |
| 7 | తొడల పైభాగం | అతలం |
| 8 | పిరుదులు | భూలోకం |
| 9 | నాభి | ఆకాశం |
| 10 | వక్షస్థలం | నక్షత్రలోకం |
| 11 | మెడ | మహర్లోకం |
| 12 | ముఖము | జనలోకం |
| 13 | నుదురు | తపోలోకం |
| 14 | తల | సత్యలోకం |
| 15 | బాహువులు | ఇంద్రాది దేవతలు |
| 16 | చెవులు | దిక్పతులు |
| 17 | వినికిడి శక్తి | శబ్దం |
| 18 | ముక్కుపుటాలు | అశ్వనీదేవతలు |
| 19 | వాసన శక్తి | వాసన |
| 20 | నోరు | అగ్ని |
| 21 | కన్నులు | అంతరిక్షం |
| 22 | చూపు | సూర్యుడు |
| 23 | కనురెప్పలు | రాత్రింబవళ్ళు |
| 24 | కనుబొమలు | బ్రహ్మము |
| 25 | అంగిలి | జలములు |
| 26 | రుచి చూచే శక్తి | రుచి |
| 27 | బ్రహ్మరంధ్రం | వేదం |
| 28 | కోరలు | యముడు |
| 28 | దంతాలు | పుత్రుడు మొదలైన వారిపై మమకారం |
| 30 | నవ్వులు | జీవులకు భ్రమగొల్పే మాయలు |
| 31 | కడగంటి చూపులు | అనంతమైన సృష్టి క్రమాలు |
| 32 | పెదవులు | సిగ్గు, లోభం |
| 33 | స్తనాలు | ధర్మమార్గాలు |
| 34 | వీపు | అధర్మమార్గం |
| 35 | పురుషాంగం | ప్రజాపతి |
| 36 | వృషణాలు | మిత్రావరుణులు |
| 37 | కడుపు | సముద్రాలు |
| 38 | ఎముకలు | పర్వతాలు |
| 39 | నాడులు, రక్తనాళాలు | నదులు |
| 40 | వెంట్రుకలు | చెట్లు |
| 41 | నిశ్వాసం | వాయుచలనం |
| 42 | ఆద్యంతాలు లేని కాలం | వయస్సు |
| 43 | కర్మములు | జీవుల చావు పుట్టుకలు |
| 44 | జుట్టు | మేఘమండలం |
| 45 | వస్త్రములు | సంధ్యలు |
| 46 | హృదయం | మూలప్రకృతి(ప్రధానం) |
| 47 | మనస్సు | చంద్రుడు |
| 48 | చిత్తము | మహత్తత్త్వం |
| 49 | అహంకారం | రుద్రుడు |
| 50 | గోళ్ళు | గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు |
| 51 | మొల | పశుసంపద |
| 52 | వాక్కుల చమత్కారం | పక్షులు |
| 53 | బుధ్ధి | మనువు |
| 54 | నివాసం | పురుషుడు |
| 55 | సప్తస్వరాలు | గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు |
| 56 | స్మరణ శక్తి | ప్రహ్లాదుడు |
| 57 | శక్తిసామర్థ్యాలు | దైత్యదానవులు |
| 58 | ముఖం | బ్రాహ్మణులు |
| 59 | భుజాలు | క్షత్రియులు |
| 60 | తొడలు | వైశ్యులు |
| 61 | పాదాలు | శూద్రులు |
| 62 | నామధేయాలు (పేర్లు) | వసురుద్రాది దేవతల పేర్లు |
| 63 | ధనసంపద | యజ్ఞములలోని హవిస్సులు |
| 64 | సత్కర్మలు | యజ్ఞములు |
ఇందులో చెప్పబడిన వాటిలో మొదటి ఏడూ (పాతాళాది అతల పర్యంతం) అధోలోకాలు.
తర్వాతి ఏడూ (భూలోకాది సత్యలోక పర్యంతం)ఊర్ధ్వలోకాలు ఈ పద్నాలుగూ లోకాలు.
ఇవే కాక మరొక యాభై లక్షణాలు చెప్పబడ్డాయి. వీటితో పరమేశ్వరుడి దివ్యవిగ్రహం ఏర్పడుతోంది. వీటిలో కొన్ని దేహం యొక్క విభాగాలుగా ఉన్నాయి. కొన్ని ఆ విరాడ్విగ్రహం యొక్క శక్తి స్వరూపాలు. మరికొన్నింటితో అంతఃకరణ చతుష్టయం. మరొకొన్ని వర్ణాశ్రమ విభాగాలు. ఇంకా తదితర విశేషాలూ ఉన్నాయి.
పరిమితం అయిన మానవ ప్రజ్ఞని అపరిమితం అయిన శ్రీమన్నారాయణుడి బ్రహ్మాండ విగ్రహంలో న్యాసం చేయటమే ధారణ అని మనం తెలుసుకోవాలి. ఇలా ధారణ చేయటం వలన అహంకారం పటాపంచలౌతుంది.
మహభారతంలో విష్ణుసహస్రనామం ఉంది కదా. దాని యొక్క ధ్యాన శ్లోకంలో భూఃపాదౌ యస్య నాభిః వియత్... అంటూ చెప్పబడింది. ఇక్కడ ఈ విరాడ్విగ్రహ వర్ణనలో భూమి పాదంగా కాక, పిరుదులుగా చెప్పబడింది. ఇక్కడ ఈ బేధానికి ఒక రకంగా సమర్థన చెప్పవలసి వస్తుంది. సాధకుడు సిధ్ధాసనం వేసుకుని కూర్చుంటాడు కదా. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాదాలు పిరుదులకు సోకి ఉంటాయి. ధ్యానశ్లోకంలో వేరుగా చెప్పటానికి అదే కారణం అనుకోవాలి.
శుకయోగి ఇంకా ఇలా నిష్కర్ష చేస్తున్నారు.
కం. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పని లే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే
ఓ మహారాజా, ఈ విశ్వం అంతా శ్రీహరితో నిండి ఉంది. అలాగే శ్రీహరి కూడా విశ్వం అంతా నిండి ఉన్నాడు. ఇలా శ్రీహరితో నిండి కనిపించని ద్రవ్యం అంటూ ఒక్క పరమాణువు కూడా విశ్వంలో లేనేలేదు.

కష్టమయిన విషయాన్ని చాలా బాగా చెప్పేరు
రిప్లయితొలగించండిశ్యామలీయం గారు
రిప్లయితొలగించండినమస్తే. మీరు వ్రాస్తున్న శ్రీమదాంధ్రమహాభాగవతం బాగుంది చాలా శ్రమకోర్చి వ్రాస్తున్నారు. మీ ప్రయత్నం అభినందనీయం.
శ్రీవాసుకి
ఇది సంతోషం కలిగించే శ్రమయే నండీ శ్రీవాసుకిగారూ, ఒక్క మాట-
తొలగించండికం, భగవంతునకై శ్రమపడఁ
దగునది విడనాడి యితర ధనముల కొఱకై
పగలనక రాత్రియనకీ
జగమంతయుఁ దిరుగువాఁడు జడబుధ్ధి కదా!
మీకు ఈ భాగవతధారావాహిక నచ్చుతున్నందుకు చాలా సంతోషం.